ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
నార్నూర్ మండల సన్నాహక సమావేశం
ఆదిలాబాద్ : నార్నూర్ మండల కేంద్రంలోని కోమురం భీం భవనంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 9న ఉదయం 10 గంటలకు నార్నూర్ మండల కేంద్రంలో అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, అనంతరం ఉట్నూర్‌లో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రధాన వేడుకలకు ర్యాలీగా పాల్గొనాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాయి సెంటర్ సార్మీడి జిల్లా గౌరవ అధ్యక్షులు మెస్రం రూప్ దేవ్ పటేల్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందుర్ దాదిరావ్, జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం మాణిక్ రావు, మండల అధ్యక్షుడు అడా శ్రీరామ్, కనక సత్యం, ఉర్వేత రూప్ దేవ్, తొడసం నాగోరావు, మెస్రం హన్మంత్ రావు, పేందుర్ దీపక్, ఆత్రం పరమేశ్వర్, మడావి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


