మహంకాళి అమ్మవారి శ్రావణ మాస బోనాలకు ఉప సర్పంచ్ రఫీక్ కు ఆహ్వానం
మెదక్ : శ్రావణ మాసం సందర్భంగా వెల్దుర్తి మండలం మన్నెవారి జలల్ పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న బోనాల జాతరకు చేగుంట గ్రామ ఉప సర్పంచ్ *రఫీక్* గారిని ఆహ్వానించారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ రఫీక్ గారి నివాసానికి వెళ్లి ఆహ్వానపత్రాన్ని అందజేశారు.25-08-20026న అభిషేకం హోమం మరియు 26-08-2026 నాడు జరగనున్న బోనాల జాతరకు విచ్చేసి అమ్మవారి పూజల్లో పాల్గొనాలని, భక్తులకు ఆశీస్సులు అందించాలని కోరారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ _"శ్రావణ మాసంలో అమ్మవారి కృప అందరికీ ఉండాలని, గ్రామ ప్రజలందరూ కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించి జాతరను విజయవంతం చేయాలని"_ కోరారు.ఆహ్వానాన్ని స్వీకరించిన ఉప సర్పంచ్ రఫీక్ గారు జాతర ఏర్పాట్లకు పూర్తి సహకారం అందిస్తానని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కావేటి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు, యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


