దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జీఎంను కలిసిన కాజీపేట కాంగ్రెస్ నాయకులు.

కాజీపేట అభివృద్ధి పనులు, రైల్వే సౌకర్యాలను వేగవంతం చేయాలని వినతి

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జీఎంను కలిసిన కాజీపేట కాంగ్రెస్ నాయకులు.

 

 

కాజీపేట న్యూస్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ని హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అంకుస్  ఆధ్వర్యంలో కాజీపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాజీపేట ప్రాంత అభివృద్ధి, రైల్వే సౌకర్యాలు మరియు ప్రజల సమస్యలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను జనరల్ మేనేజర్  దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కాజీపేట నూతన బస్టాండ్‌కు సంబంధించిన స్థలాన్ని త్వరితగతిన అప్పగించడం, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులు మరియు స్థానికులకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కాజీపేట జంక్షన్‌ను ప్రత్యేక రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడం, కాజీపేట నుంచి బోడగుట్ట ప్రాంతానికి రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ( ఎఫ్ ఓ బి ) నిర్మించడం వంటి డిమాండ్లను సమర్పించారు. అదేవిధంగా కాజీపేటలో అదనపు రైలు హాల్టులు కల్పించాలని, కోవిడ్ అనంతరం నిలిపివేసిన రైలు సర్వీసులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రహమతుల్లా మహమ్మద్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్, కర్ణాటక సంపర్క్ క్రాంతి, టాటానగర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–సికింద్రాబాద్ గరీబ్ రథ్ వంటి ముఖ్యమైన రైళ్లకు కాజీపేటలో హాల్ట్ కల్పించాలని, అలాగే కాజీపేట–బెలగావి ఎక్స్‌ప్రెస్ తదితర నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. కాజీపేట అభివృద్ధి, ప్రజల రవాణా సౌకర్యాలు, స్థానికుల ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ గారిని కాంగ్రెస్ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుంటి కుమారస్వామి, సుంచు అశోక్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ పసునూరి మనోహర్, ఎక్స్- ఎన్ ఎస్ యు ఐ I నేషనల్ కోఆర్డినేటర్ రహమతుల్లా మహమ్మద్, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు, దొంగల కుమార్ యాదవ్, ఇప్ప శ్రీకాంత్, బైరబోయిన రమేష్ యాదవ్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News