విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం ప్రారంభం
స్వయంగా వడ్డించి, పిల్లలతో కలిసి తిన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
గండిపేట (రంగారెడ్డి): పేద విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యకరమైన విద్యాభివృద్ధే ధ్యేయంగా రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ ఘనంగా ప్రారంభిం చారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాటు కూర్చొని ఆయన కూడా అల్పాహారం స్వీకరించారు.ఆకలితో చదువు దూరం కాకూడదు: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. "పేద విద్యార్థులు ఉదయాన్నే పాఠశాలకు ఖాళీ కడుపుతో రాకూడదన్నదే మా ప్రధాన సంకల్పం. పౌష్టికాహారం అందినప్పుడే విద్యార్థుల్లో చురుకుదనం, ఏకాగ్రత పెరుగు తాయి" అని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


