ప్రభుత్వ పాఠశాలకు దాతల మహోన్నత సాయం

ప్రభుత్వ పాఠశాలకు దాతల మహోన్నత సాయం

  • విద్యార్థులకు ప్రొజెక్టర్, స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ
  • సామగ్రిని అందజేసిన మండల విద్యాధికారి నకిరేకంటి రవి

పెన్‌పహాడ్ ( సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని మండల విద్యాధికారి నకిరేకంటి రవి అన్నారు. సింగారెడ్డిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు దాతల ఆర్థిక సహాయంతో సమకూరిన డిజిటల్ ప్రొజెక్టర్, స్పోర్ట్స్ డ్రెస్సులను ఆయన విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల డిజిటల్ విద్య కోసం దాత రిటైర్డ్ టీచర్  బొల్లెద్దు నరేందర్ ₹13,000 విలువైన ప్రొజెక్టర్‌ను బహుకరించగా, విద్యార్థుల కోసం దాతలు రౌత్ ఉపేందర్ రావు (₹9,000), వార్డు మెంబర్ పేర్ల గణేశ్ (₹5,500) ఉదారంగా స్పోర్ట్స్ డ్రెస్సులను సమకూర్చారు.ఈ సందర్భంగా ఎంఈఓ రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు దాతల సహకారం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు . రవీందర్ బాబు, గ్రామ సర్పంచ్ ఒగ్గు కిరణ్, పంచాయతీ సెక్రటరీ షేక్. అఖిల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్ల శ్రీనివాసులు, ఉపాధ్యాయులు . సరిత, శిగ మహేశ్, దాతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: