కేసీఆర్ మరణాన్ని కోరడం దారుణం

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను జానీ తీవ్రంగా ఖండించారు

కేసీఆర్ మరణాన్ని కోరడం దారుణం

మల్లంపల్లి,:ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండి జానీ మాట్లాడుతూ.. ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని జానీ అన్నారు. నిరసన సమయంలో చోటుచేసుకున్న తోపులాటలో సబితా ఇంద్రారెడ్డి జుట్టు లాగినట్లు, సునీతా లక్ష్మారెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించి నట్లు వచ్చిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. “మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యవహారం ప్రజాస్వా మ్యానికి మంచిది కాదు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న ఆరోపణలను జానీ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే కానీ ఒక రాజకీయ నాయకుడి ప్రాణాల గురించి మాట్లాడటం అత్యంత దురదృష్టకర మని ఆయన అన్నారు. జానీ మాట్లాడుతూ.. “ కెసిఆర్ గారిని  రాజకీయంగా విమర్శించవచ్చు, ఆయన విధానాలను ప్రశ్నించవ చ్చు. కానీ ఆయన మరణాన్ని కోరుకోవడం మాత్రం రాజకీయ సంస్కృతికి విరుద్ధం. ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిం చాలి” అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన రాజకీయ చర్చ జరగాలని జానీ సూచించారు. “అధికారంలో ఉన్నవారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. వ్యక్తిగత కక్షలు, ద్వేషపూరిత వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడం మంచిది కాదు. కేసీఆర్‌పై కాంగ్రెస్‌కు రాజకీయంగా వ్యతిరేకత ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శించాలి” అని జానీ పేర్కొన్నారు. 

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ