కోయిలకొండలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

విలేకరుల సమావేశంలో కృష్ణయ్య ఫైర్

కోయిలకొండలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

‎కోయిలకొండ: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య మండిపడ్డారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‎​పార్టీ కార్యాలయ ఫ్లెక్సీల వివాదంలో పోలీసులతో కేసులు పెట్టించినంత మాత్రాన భయపడేది లేదన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నీరు ఇచ్చామని, గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో రాజేందర్ రెడ్డికి 20 వేల మెజార్టీ ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: