కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
మల్లంపల్లి(ములుగు) మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజుమల్లంపల్లి, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు అన్నారు.కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవితల ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని అన్నారు. సామాన్య ప్రజల పక్షాన నిలిచి, అన్యాయం, అక్రమాలు, అణచివేతకు వ్యతిరేకంగా తన కలాన్ని అక్షరాయుధంగా మలిచారని పేర్కొన్నారు.తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కాళోజీకి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని గోల్కొండ రాజు అన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం సముచిత గౌరవమని తెలిపారు.మల్లంపల్లి ప్రాంత ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కూడా ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాళోజీ స్ఫూర్తితో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ, ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కాళోజీ చూపిన ప్రజా చైతన్య మార్గాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలన
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


