ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్  :  కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని  సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. చేశారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు గండ్రత్ రమేష్, సిరికొండ రమేష్, మజార్, ముజాహిద్ శ్రావణ్, అజార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: