రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడుమొర్రిరాజు యాదవ్

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి



మల్లంపల్లి (ములుగు) : కేంద్రరాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడుమొర్రిరాజు యాదవ్ అన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా, రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిగా లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ అధికారి (ఏవో) నల్లాల శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న  రైతుబీమా పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు సాగు సమయంలో ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, ఎరువుల కొరత లేకుండా అధికారులు పర్యవేక్షించాలని రాజు యాదవ్ డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి పాషా, కుక్కల సంపత్,వాసు పాల్గొన్నారు

Views: 49

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: