ప్రజా చైతన్య ప్రదాత కాళోజీ
పెద్దపల్లి ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కృషి మరువలేనిదని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా స్పందించడం కాళోజీ ప్రత్యేకత అన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ప్రజల్లో స్ఫూర్తి, చైతన్యాన్ని నింపిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన రచనలు చదవాలని, యువత కాళోజీ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ ,సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


