విద్యార్థులు వేధింపులకు గురైతే నిర్భయంగా పిర్యాదు చేయాలి.
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన.
గంభీరావుపేట : జిల్లాలో విద్యార్థుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.అవగాహన కార్యక్రమాల్లోభాగంగా విద్యార్థులకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో చట్టం,సోషల్ మీడియా వినియోగం/మోసాలు,మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈసందర్భంగా బుధవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంటల , గజసింగవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి అవగాహన కల్పించి , వేధింపులకు గురైతే వెంటనే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని , నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని షీ టీమ్అధికారులు సూచించారు.సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని , గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐలు ప్రమీల,రవి , సిబ్బంది శ్రీలత, ప్రియాంక,శ్రీనివాస్‌తో పాటు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


