ఫత్లాపూర్‌లో నిరసన.. దిష్టిబొమ్మల దహనం

ఫత్లాపూర్‌లో నిరసన.. దిష్టిబొమ్మల దహనం

బిచ్కుంద,: బడుగు, బలహీన వర్గాలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ ఫత్లాపూర్ గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి కె. తారక రామారావు దిష్టిబొమ్మలను నిరసనకారులు దహనం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత నాయకులు వెంటనే రాజీనామా చేయాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వాన్ని కాపాడేలా రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మిని మారుతి, ఉపసర్పంచ్ రాజ్‌కుమార్, మాల సంఘ నాయకులు జి. రవీందర్, ఎం. గంగాధర్, ఎన్. కిరణ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 51

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ