ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

  • అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలి.
  • క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర సీఈఓ సుదర్శన్‌రెడ్డ

ఆదిలాబాద్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేరకు గుర్తించి తొలగించాలని సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి తాంసీ, భీంపూర్ మండలాల్లో సీఈఓ పర్యటించారు. తాంసీ మండలం ఘోట్కూరి, భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను తనిఖీ చేశారు.బీఎల్‌ఓల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించిన సీఈఓ, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో తహశీల్దార్లు సంబంధిత వ్యక్తులకు మార్గదర్శకాలు అందించి, అవసరమైన పత్రాలను సేకరించి పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ అనంతరం కలెక్టర్ల స్థాయిలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత మూడు రోజులుగా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోందని, జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఆయన వివరించారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఈఓ సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రతి వివరాన్ని సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి దశలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, అనర్హుల పేర్లు కొనసాగకుండా నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని డైట్ కళాశాల, సంజయ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సీఈఓ, కలెక్టర్ సందర్శించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్, ఆదిలాబాదు, తాంసీ, భీంపూర్ తహశీల్దార్లు శ్రీనివాస్, గణేష్, రమేష్, ఎన్నికల నాయబ్ తహశీల్దార్లు సూరజ్, ఇస్తారీ, ఎన్నికల సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ