తాటిపెల్లి గురుకులంలో మండల స్థాయి ఆటల పోటీలు షురూ
మల్యాల, మల్యాల మండలంలో తాటిపెల్లి బాలికల గురుకుల పాఠశాలలో మల్యాల మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎంఈఓ నీలగిరి జయసింహారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు బాలికల విభాగంలో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ఇక్కడ ప్రతిభ కనబరిచి గెలిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మెట్పల్లి లత, ప్రిన్సిపాల్ మానస, మాజీ అధ్యక్షులు విశ్వప్రసాద్, మండల కన్వీనర్ గంగాసాగర్, పీడీలు వరలక్ష్మి, శేఖర్, రమేష్, మధులిక, ఆశ్రిత, అనిల్, నవీన్, అక్షయ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


