ఫత్లాపూర్‌లో రేషన్ కార్డులు, గోడ గడియారాల పంపిణీ
బిచ్కుంద :ఫత్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పద్మిని మారుతి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన లబ్ధిదారులకు గోడ గడియారాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మిని మారుతి, ఉపసర్పంచ్ రాజకుమార్, వార్డు సభ్యులు మల్లికార్జున్, శ్యామల, సురేఖ, గంగాధర్, సర్వర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ, GPO కాశినాథ్, రేషన్ డీలర్ గంగాధర్, గ్రామ యువకులు అన్వార్, సాయికిరణ్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


