బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
- అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే అడ్డుపడ్డ పోలీసులు
- సర్పంచ్ ల పెండింగ్ బిల్లు లను వెంటనే విడుదల చేయాలి.
- మండల సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షులు బేస్త లక్ష్మణ్
చిలిపిచేడ్ (మెదక్ ): తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లు ల కోసం అసెంబ్లీ ముట్టడి చేయడానికి చిలిపిచేడ్ మండల మాజీ సర్పంచ్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా వారు వెళ్తున్న క్రమంలో మాజీ సర్పంచ్ లను స్థానిక ఎస్సై నర్సింలు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్బంగా చిలిపిచేడ్ మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బేస్త లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా మాజీ సర్పంచ్ లు చేసిన పనులకు సంబందించిన బిల్లులు ఇవ్వడం లేదని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైన పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వన్ని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో రాష్ట్రమంతట ఉద్యమం చేస్తామని ప్రభుత్వన్ని హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు బీసీ లక్ష్మణ్ యాదగిరి గోపాల్ రెడ్డి విట్టల్ రాకేష్ తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

