దేవాలయం కూల్చివేత

దేవాలయం కూల్చివేత

  • - గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి
  • - సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 

సంగారెడ్డి డెస్క్ : పాత కాలం నాటిగా ఉన్న పోచమ్మ దేవాలయాన్ని కొందరు  జేసీబీ సహాయంతో వాటిని పూర్తిగా దగ్గర ఉండి కూల్చి వేసిన  సంఘటన సంగారెడ్డి మండలం జిల్లా కంది గ్రామం లక్ష్మీ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.గ్రామంలో నర్సింలు అనే వ్యక్తి అదే పోచమ్మ దేవాలయానికి స్థానికంగా పూజారిగా ఉంటూ వస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే నర్సింలుకు కొంతమంది హిజ్రాలు ఆర్థికంగా గతంలో సహాయం చేశారు. అతని చనిపోయినప్పుడు కూడా వారే దగ్గరుండి అంత్యక్రియలు చేసినట్టు స్థానికంగా తెలిసింది. ఈ నేపథ్యంలో నర్సింలుకు గతంలో ప్రభుత్వం లక్ష్మీ నగర్ కాలనీలో 100 గజాల స్థలాన్ని కేటాయించింది. అయితే నర్సింలు మృతి అనంతరం కొందరు హిజ్రాలు వారి కుటుంబానికి కొద్ది రోజుల క్రితం మరో రూ.5 లక్షలు ఇచ్చి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం వారంతా కలిసి ఒక జెసిబిని తీసుకొచ్చి అక్కడున్న ఇంటి తోపాటు పోచమ్మ దేవాలయాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు కారణాలు ఇతర విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేతలకు కారణమైన హిజ్రాలను, ఇతర వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ