ట్రెసా రాష్ట్ర నూతన అధ్యక్షాకార్యదర్శులకు ఘనసన్మానం
ర్యాలీతో ఘనస్వాగతం పలికిన రెవెన్యూ ఉద్యోగ సంఘాలు
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా ) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కె. గౌతమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎల్. రమణ్ రెడ్డిని నిజామాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఉద్యోగులు నూతన రాష్ట్ర నాయకత్వానికి శుభాకాం క్షలు తెలిపారు.వారి నాయకత్వంలో ట్రెసా మరింత బలోపేతం కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ట్రెసా నూతన అధ్యక్షులు కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ట్రెసా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ప్రధానకార్యదర్శి ఎల్. రమణ్ రెడ్డి నిబద్ధతతో పనిచేసే నాయకుడని, ఉద్యోగుల సమస్యలపై ఓర్పుతో పోరాడే యువ నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. నూతన నాయకత్వంలో ఉద్యోగుల చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని రెవెన్యూ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగుల ఐక్యతను చాటుతూ ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిం చారు. బోధన్ డివిజన్, ఆర్మూర్, కలెక్టరేట్, జీపీఒ ల సంఘాల ప్రతినిధులు, అలాగే జిల్లాలోని పలువురు రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిజామా బాద్ జిల్లా ట్రెసా కార్యదర్శి ప్రశాంత్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, కోశాధికారి విజయ్ కాంత్ రావు, వైస్ ప్రెసిడెంట్లు భూపతి ప్రభు, వినయ్ సాగర్‌తో పాటు ట్రెసా సీనియర్ నాయకుడు, డిచ్ పల్లి తహసీల్దార్ సతీష్ రెడ్డి పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


