నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
- 12 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత
నాగర్ కర్నూల్, నగర్ కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్వకుర్తి మండలం తర్నికల్ తండా శివార్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముడావత్ లక్ష్మణ్ ను అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 12 లీటర్ల అక్రమ మద్యం, అక్రమ రవాణాకు ఉపయోగించిన మోటార్ సైకిల్ ను సీజ్ చేశారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించినట్లు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్ లో వాసురామ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, కె.శ్రీనివాస్, అనూష పాల్గొన్నారని వెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


