కాళోజీ నారాయణరావు జయంతి
భూపాలపల్లి : కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్. తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో, సామాజిక విలువలను పెంపొందించడంలో ఆయన సాహిత్యం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కాళోజీ గారి ‘నా గొడవ’ వంటి రచనలు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని కల్పించాయని తెలిపారు. ఆయన ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత వంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు. కాళోజీ నారాయణరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు రత్నం, పూర్ణచందర్, కాశీరాం, ఆర్‌ఎస్‌ఐలు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


