సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై చర్యలకు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై చర్యలకు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై చర్యలకు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు

ఆమనగల్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి బేగంబజార్‌ సెంట్రల్‌ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన.. కేటీఆర్‌ వ్యాఖ్యలు రాజకీయ విమర్శల పరిధిని దాటి వ్యక్తిగతంగా అవమానించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపై విమర్శలు చేసే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలకు చట్టపరమైన హద్దులు ఉంటాయని మల్లు రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారానికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఆధారాలను భద్రపరచాలని, వాటిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎంపీ కోరారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత దూషణల స్థాయికి తీసుకెళ్లడం సరికాదని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ ఎలుగొండ మధుసూదన్‌రెడ్డి, గుర్రం కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Views: 97

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: