అల్మాస్‌పూర్‌లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డిపేట,: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ నాగేల్లి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.1.97 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
లబ్ధిదారుల వివరాలు:
1. పెద్దవేని నేహా – రూ.15,000
2. మహమ్మద్ అరిఫ్ – రూ.18,000
3. వంగల కిష్టారెడ్డి – రూ.55,000
4. వడ్ల సుశీల – రూ.15,000
5. కందునూరి నారాయణ – రూ.60,000
6. పసుల రేణుక – రూ.34,000ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సోనవేని రాజయ్య, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉచిడి పవన్‌రెడ్డి, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు సిరిసిల్ల సురేష్, చింతలఠనం లచయ్య, వంగల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


