దేవాలయ భూముల వివరాలు వెల్లడించాలి

దేవాదాయ కమిషనర్‌కు బీజేపీ నాయకుల వినతి

దేవాలయ భూముల వివరాలు వెల్లడించాలి

ఎల్లారెడ్డిపేట, :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవాదాయ భూముల వివరాలను వెల్లడించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు కరీంనగర్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి సుప్రియను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలోని కేశవ పెరమండ్ల ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయం, శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలకు సంబంధించిన దేవాదాయ భూముల పూర్తి వివరాలను తెలియజేయాలని వారు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ సుప్రియ స్పందిస్తూ, ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలను పరిశీలించి తప్పకుండా తెలియజేస్తామని బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు వార్డ్ కిరణ్ నాయక్, మండల ఉపాధ్యక్షులు నేవురి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 100

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: