స్పీకర్‌ గౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు

కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీల దిష్టిబొమ్మ దహనం

స్పీకర్‌ గౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు

అమనగల్లు : శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమనగల్లు మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్సీల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ పదవికి అవమానకరమన్నారు. స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు. రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శలు చేయాలే తప్ప వ్యక్తిగతంగా, కులపరంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యనాయక్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వస్పుల శ్రీశైలం, కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ ఖాదర్‌, జిల్లా నాయకులు వస్పుల మానయ్య, సీనియర్‌ నాయకులు దావా ధనుంజయ, కాలే మల్లయ్య, ఖాదర్‌ ఖాద్రి, శ్రీధర్‌రెడ్డి, రాగ్య నాయక్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్‌, గాజుల సురేష్‌, అబ్దుల్‌ అలీమ్‌, వగ్గు మహేష్‌, కండె సాయి, సురేష్‌ నాయక్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఫరీద్‌, శ్రీను నాయక్‌, దేవరశెట్టి మహేష్‌, నాజర్‌, కుమార్‌ గౌడ్‌, రఫీ, ఫిరోజ్‌, శివ, రవి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు..

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ