భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే

భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే

  • ఆర్డీవో వేణుమాధవరావు
  • రాజపేట గ్రామం పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక
  • అనాజిపురం రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు

పెన్ పహాడ్,(సూర్యాపేట): భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూమి రీ సర్వే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆర్డీవో వేణుమాధవరావు తెలిపారు. మండల పరిధిలోని రాజపేట గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నేపథ్యంలో బుధవారం అనాజిపురం గ్రామంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసిల్దార్ గుమ్మి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ఆర్డీవోతో పాటు సూర్యాపేట వ్యవసాయ శాఖ ఏడి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్డీవో వేణు మాధవరావు మాట్లాడుతూ... పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన రాజపేట గ్రామంలో రీ సర్వేను వంద శాతం విజయవంతం చేసేందుకు రైతులంతా క్షేత్రస్థాయిలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ సర్పంచ్ అనుము లపూరి నాగయ్య మాట్లాడుతూ... రైతులెవరూ ఎలాంటి అపోహలకు లోనుకాకుండా సర్వేలో పాల్గొని తమ భూములకు సంబంధిం చిన సరైన వివరాలను అధికారులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అజీజ్ ఉన్నిసా, రంజిత్ రెడ్డి, జీపీఓలు, ఏఈఓ మురళి మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: