పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ
మహబూబ్నగర్ : సెప్టెంబర్ 9 2026న కాళోజి జయంతిని జలసాధన దీక్ష దినంగా పాటించాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీడిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జలసాధన జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి నిరసనలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు,లక్ష్మీదేవి పల్లి,అమ్రాబాద్ లిఫ్టును త్వరగా నిర్మించి రైతుల సంక్షేమానికి వినియోగించాలన్నారు. కృష్ణ ,బీమా నదుల సంగమం తంగడి నుండి 72 జీవో మేరకు భారీ ఎత్తిపోతల పథకం చేపట్టాలి.ఆర్డీఎస్ నీరు విడుదల,జూరాల గట్టు ఎత్తిపోతల వెల్టూరు గుందిమల్ల బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయమై ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు రాఘవాచారి,జనార్ధన్ వీర బ్రహ్మచారి చెన్న కృష్ణ అహ్మద్ ఖలీల్ లక్ష్మీకాంత్ సారంగి తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


