నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

నిజామాబాద్ :నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో పద్మవిభూషణ్, ప్రజాకవి డాక్టర్ కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ నాయకత్వం వహించగా, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ దినేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమాదేవి, పరిపాలనా సూపరింటెండెంట్ పెదోళ్ళ నాగరాజు, సుజాతతో పాటు పలువురు ముఖ్య బాధ్యులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సమాజానికి చేసిన సేవలను, తెలంగాణ భాషా సాహిత్యాలకు అందించిన అపారమైన కృషిని స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో కళాశాల వైద్యులు, బోధనా సిబ్బంది, ఇతర ఉద్యోగులతో పాటు పీజీ, యూజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు. వారితో పాటు కళాశాల పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ సిబ్బంది, భద్రతా బాధ్యతలు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కాళోజికి నివాళులర్పించారు. కళాశాల యాజమాన్యం, వైద్య విద్యార్థులు, సమస్త సిబ్బంది ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం ద్వారా కాళోజి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: