కలెక్టరేట్ లో ఘనంగా కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు

కలెక్టరేట్ లో ఘనంగా కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు

నిర్మల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు బుధవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.  ఈ జయంతి వేడుకలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రచించి, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సేవలకు కేంద్ర ప్రభుత్వం 1992 లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పారు. ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కాళోజీ లాంటి గొప్ప వ్యక్తుల జయంతులను ఈ విధంగా అధికారికంగా నిర్వహించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇటువంటి మహనీయుల జయంతి ఉత్స వాల అధికారికంగా నిర్వహించడం ద్వారా భావితరాల వారికి వారి గొప్పతనాన్ని తెలియజెప్పిన వారిమవుతామని తెలిపారు.  ఈ జయంతి వేడుకల్లో డిఆర్ఓ రాథోడ్ రమేష్, బిసి, ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఎల్డిఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ