గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి - ఎస్సై పోచయ్య
రేగోడ్ (మెదక్ ):రేగోడ్ మండలంలోని అన్ని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ అధికార పోస్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై పోచయ్య సూచించారు.గణేష్ మండపం ఎక్కడ పెడతారో వాటి పూర్తి వివరాలు,ఊరేగింపు రూట్, నిమజ్జనం చేసే స్థలాన్ని ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నింపాలని అన్నారు. విద్యుత్ కొరకు విద్యుత్ శాఖ అధికారులచే పర్మిషన్ పొందాలని అన్నారు. ప్రతి గణేష్ మండపం వద్ద తప్పనిసరిగా ఇద్దరు వ్యక్తులు 24 గంటలు ఉండాలని అన్నారు.మండప నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటిస్తూ, సకాలంలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసి,శాంతి భద్రతలకు విఘతం కలగకుండా భక్తి శ్రద్దలతో శాంతి యుతంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


