ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 కాంగ్రెస్ నాయకులు వి.చంద్రారెడ్డి

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జిన్నారం  సంగారెడ్డి జిల్లా.జిన్నారం మండలం బొల్లారం డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన వన్ డే..వన్ వార్డు కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ  సమావేశంలో డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వి.చంద్రారెడ్డి  కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆమెను కోరారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ప్రజల ఇబ్బందులను తొలగించాలన్నారు. ప్రజల అవసరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పించాలని అన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: