లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి 

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి 

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారి సంగారెడ్డి జిల్లాలోని ఓ కాలేజీకి కొద్ది రోజుల క్రితమే జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అయిన గోవిందరాం తనిఖీకి వెళ్లారు.అయితే అక్కడ చిన్న చిన్న పొరపాట్లు,ఇతర అంశాలను పరిశీలించిన ఆయన వాటిని సరిచేసి కాలేజీకి అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే తనకి రూ.50 వేలు లంచంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు.ఈవిషయంలో చేసేది లేక సదరు కాలేజీ యాజమాన్యం ముందుగా గోవిందరాం కు రూ.30 వేలు ఇచ్చారు.మిగతా డబ్బు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేయగా వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ అధికారి అయిన గోవింద్ రాం తన ఆఫీసులో మిగతా రూ.20 వేల డబ్బులు బాధితుల నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈమేరకు అతనిపై అధికారులు కేసు నమోదు చేసి మిగతా విషయాలు దర్యాప్తు చేస్తున్నారు.ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్,ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు,రమేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ ఏ అధికారి లంచం ఇవ్వమంటే మాకు సమాచారం అందించండి అని సూచించారు.

Views: 336

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: