నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
నార్కట్ పల్లి,మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సిరికొండ సురేష్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశంను నార్కట్ పల్లి ఎస్ ఐ పి.విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సిరికొండ సురేష్ మాట్లాడుతూ... వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యంతో జరుపుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను తప్పనిసరిగా పాటించాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.ఈ సమావేశంలో వివిధ మతాల పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


