విద్యార్థుల చెంతకే బ్యాంకింగ్ సేవలు చేర్చిన చీదేళ్ల ఎస్‌బీఐ బ్రాంచ్
పెన్‌పహాడ్,( సూర్యాపేట): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీదేళ్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సీఎస్‌పీ నిర్వాహకులు పేరూరి వెంకటేశ్వర్లు నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పాఠశాల విద్యార్థులకు అక్కడికక్కడే నూతన బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేనేజర్ రవీందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా శాఖ అందించే స్కాలర్‌షిప్ (విద్యార్థి వేతనాలు) ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా విద్యార్థుల అకౌంట్లలో జమ కావడానికే ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌బీఐ అందిస్తున్న ఈ ఉచిత జీరో బ్యాలెన్స్ ఖాతాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక క్యాంప్ ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులు నూతన ఖాతాలను పొందారు.ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ వీరు, క్యాషియర్ నాగేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


