నెమలి గ్రామానికి చెందిన ఇద్దరికీ సీఎంఆర్ చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే పంపిణీ.
బాన్సువాడ నియోజకవర్గం లోని నెమలి గ్రామాని కి చెందిన ఇద్దరు నిరుపేదల కు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం లోని నెమలీ గ్రామాని కి సంబంధించిన పందిరి అంజవ్వ, తీర్లపురం సాయిలు అర్హులైన లబ్ధిదారుల కు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందు లో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య లబ్ధిదారులైన పందిరి అంజవ్వ, తిర్లపురం సాయిలు, తెలంగాణ ప్రభుత్వ సీఎంఆర్ఎఫ్ సహాయక చెక్కులను ప్రజాప్రతినిధులు, క్యాంప్ కార్యాలయ అధికారుల సమక్షం లో అందుకున్నారు. ఈ సందర్భం గా లబ్ధిదారులు మాట్లాడుతూ. తమకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి, నిరంతరం ప్రజలకు అందుబాటు లో ఉంటూ సేవ చేస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు, సర్పంచ్ సింగిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, చందూర్ సాయిలు, బండి లక్ష్మణ్, కోర్వ నవీన్ కార్యాలయ సిబ్బంది సతీష్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


