డ్రైనేజీ కూల్చివేతపై నోటీసులు

  విజన్‌ ఆంధ్ర కథనంతో స్పందించిన అధికారులు

డ్రైనేజీ కూల్చివేతపై నోటీసులు

దౌల్తాబాద్‌,సిద్దిపేట: మాచిన్‌పల్లి గ్రామంలో మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజీని కూల్చివేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యవహారంపై పంచాయతీ అధికారులు స్పందించారు. దీనిపై విజన్‌ ఆంధ్రలో వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి శ్వేత.. ఇంటి యజమానికి నోటీసులు జారీ చేశారు. కూల్చివేసిన మురుగు కాలువను పునరుద్ధరించాలని, నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని నోటీసులో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Views: 173

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: