వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: బిజినపల్లి ఎస్ఐ శంషుద్దీన్
నాగర్ కర్నూల్ /బిజినపల్లి, : మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సోమవారం ఉదయం 11 గంటలకు బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ఐ శంషుద్దీన్ మాట్లాడుతూ... గణేష్ మండపాల ఏర్పాటు, నిర్వహణ, పాటించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, ట్రాఫిక్ కు, అత్యవసర వాహనాలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. విద్యుత్ వైరింగ్ లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, లౌడ్ స్పీకర్లు, డీజే సౌండ్ సిస్టంలను నిబంధనల మేరకు నిర్దేశిత సమయంలోనే వినియోగించాలని తెలిపారు. మండపాల వద్ద శాంతిభద్రతలకు నిర్వాహకులే బాధ్యత వహించాలని, పరిశుభ్రత పాటించాలని, వివాదాస్పద, రెచ్చగొట్టే కార్యక్రమాలకు అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేశారు.పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


