గణనాథునికి పూజలు జరిపించిన ఆర్ బీ ఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి.

గణనాథునికి పూజలు జరిపించిన ఆర్ బీ ఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి.

కుల్కచర్ల, వికారాబాద్: కుల్కచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో విఘ్నేశ్వరునికి  ఆర్ బీ ఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేటట్లు ఆ స్వామి ఆశీర్వాదం ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు. పూజలు జరిపించిన అనంతరం తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. వినాయక మండపం దగ్గర ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వచ్చే సంవత్సరం గ్రామంలో ప్రతి వినాయక మండపం దగ్గర కేవలం మట్టి వినాయక ప్రతిమనే ప్రతిష్టించాలని సూచించారు. ఫలితంగా పర్యావరణ పరిరక్షణను కాపాడవచ్చునని తెలియజేశారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వినాయక ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా...
ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు రావు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
ప్రజా సమస్యలను పరిష్కరించండి
గణనాథునికి పూజలు జరిపించిన ఆర్ బీ ఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి.
ప్రజా సమస్యలను పరిష్కరించండి
గణనాథుడికి ప్రత్యేక పూజలు:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు