ఏళ్ళు గడుస్తున్నా ఆవిష్కరణకు నోచుకోని 'తెలంగాణ తల్లి' విగ్రహం!
- తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను నిర్లక్ష్యం చేయొద్దు
- అధికారంలో లేకపోతే విగ్రహాన్ని పట్టించుకోరా?
- విగ్రహావిష్కరణపై వంటేరు ప్రతాపరెడ్డి స్పందించాలి
సిద్దిపేట జిల్లా : గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఎంతో ఆంధ్ర బ్యాంకు ముందు గ్రామంలో శివాలయం సర్కిల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ తల్లి' విగ్రహం ఇప్పటికీ ఆవిష్కరణకు నోచుకోకపోవడం పట్ల వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఏర్పాటు చేసి గద్దెకు సైతం రంగులు లేక కలహీనంగా కనబడుతుంది గజ్వేల్ నియోజకవర్గం లో ప్రారంభానికి నోచుకోకపోవడం సైతం పార్టీ అధికారంలో లేకపోతే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడా అని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి దీనిపై వెంటనే స్పందించాలని, ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ వహించి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కొండపాక మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కాకుండా అలానే ఉండిపోవడం సరికాదని, వెంటనే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లికి తగిన గౌరవం అందించాలని మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


