పంతంగి టోల్ ప్లాజా వద్ద 61 కిలోల గంజాయి స్వాధీనం 

పంతంగి టోల్ ప్లాజా వద్ద 61 కిలోల గంజాయి స్వాధీనం 

- ఐదుగురు అరెస్ట్ - ఎస్ హెచ్ ఓ  రవిచంద్ర రెడ్డికి నగదు బహుమతి

హైదరాబాద్ : చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 61 కిలోల ఎండు గంజాయిని, గంజాయి తరలింపుకు ఉపయోగించిన ఒక ఆటోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్పట్లో ఎస్ హెచ్ ఓ  మోత్కూర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ కె. రవిచంద్ర రెడ్డి మరియు సిబ్బంది ప్రదర్శించిన సమర్థవంతమైన పనితీరును గుర్తిస్తూ డైరెక్టర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్, తెలంగాణ నగదు బహుమతితో సత్కరించారు. ప్రస్తుతం ఎస్ హెచ్ ఓ సీఐ గా కల్వకుర్తి లో విధులు నిర్వహిస్తున్న  కె. రవిచంద్ర రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నగదు బహుమతి తనతో పాటు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?