రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా నాంపల్లిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా నాంపల్లిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

  • ఓటు హక్కును పరిరక్షించాలి..
  • కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి
  • నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి

నాంపల్లి: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో గురువారం నాంపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది.నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సర్ ప్రక్రియల పేరుతో బడుగు, బలహీన వర్గాలు, అర్హులైన ప్రజల ఓటు హక్కుకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. దేశంలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల ఓటు హక్కుకు ఎలాంటి నష్టం కలగకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడే వరకు కాంగ్రెస్ శ్రేణుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

WhatsApp Image 2026-10-08 at 2.59.25 PM

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?