ఓవర్‌ఫ్లో పైపు విరిగి.. నీరు వృథా!
పట్టించుకోని అధికారులు.. పారుపల్లి గ్రామస్తుల ఆవేదన
ముత్తారం, : ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామ ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో పైపు విరిగిపోవడంతో గత కొన్ని రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది.పైపు దెబ్బతిన్న విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాటర్ ట్యాంక్ నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతున్న సమయంలో విరిగిన పైపు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వచ్చి వృథాగా పోతుందని స్థానికులు తెలిపారు.ఇప్పటికే పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఎదురవు తున్న తరుణంలో విలువైన నీరు ఇలా వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విరిగిన ఓవర్‌ఫ్లో పైపును వెంటనే మరమ్మతు చేసి,నీటి వృథాను అరికట్టాలని పారుపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


