హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు
హుస్నాబాద్ : పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ,ప్రజల మనోభావాలను దెబ్బతీసే రావణవధ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిషేధించాలని కౌన్సిలర్ గాదెపాక రవీందర్ హితవు పలికారు.ఈ సందర్బంగా హుస్నాబాద్ జనజాగృతి కార్యాలయంలో గురువారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అకుంఠిత దీక్షతో బ్రహ్మ మనసును గెలిచిన రావణశూరుడు రావణబ్రహ్మగా ఖ్యాతి గడించాడన్నారు. అలాంటి గణరాజ్య చక్రవర్తిని అవమానిస్తూ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు.ఆ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున టపాకాయలు,బాణాసంచా కాల్చడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని విచారం వ్యక్తం చేశారు.అందుకే పర్యావరణ పరిరక్షణ కోసమైనా ఇలాంటి చర్యలు చేపట్టడం నిషేధించాలని రవీందర్ కోరారు. హక్కులనేత "బాలగోపాల్" వర్ధంతిమానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ 17వ వర్ధంతి సందర్భంగా ఇదే సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ హక్కులకు భంగం కలిగిన ప్రతిచోట బాలగోపాల్ పోరాడినారని తెలిపారు.చుండూరు, కారంచేడు, గుజరాత్ వంటి ఎన్నో ఘటనలలో, బూటకపు ఎన్కౌంటర్లు జరిగిన చోట బాలగోపాల్ గొంతు వినిపించాడని అన్నారు ఈ కార్యక్రమంలో జనజాగృతి అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్, బీఎస్పీ నాయకులు బోయిని బాబు, ప్రజాసంఘాల నాయకులు మెతుకు కొమురయ్య, నాంపల్లి సమ్మయ్య, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, గడిపే చిన్నబాలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


