ఓట్ చోరీకి పాల్పడుతున్న ఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

ఓట్ చోరీకి పాల్పడుతున్న ఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

రాహుల్,ప్రియాంక,ఖర్గే అరెస్టుకు నిరసనగా చండూరు చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం

చండూరు,(నల్గొండ) : ఓట్ చోరీకి పాల్పడుతున్న ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని,కాంగ్రెస్ జాతీయ నాయకులు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,పార్లమెంట్ నాయకురాలు ప్రియాంక గాంధీ,కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే*ల అరెస్టుకు వ్యతిరేకంగా మునుగోడు ఎమ్మెల్యే *కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు మేరకు చండూరులో నిరసన కార్యక్రమం జరిగింది. చండూరు మండల పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి,చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్ ఆధ్వర్యంలో చండూరు చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ లింగస్వామి,మహిళా అధ్యక్షురాలు పందిరి రాధా,జిల్లా నాయకులు ఇరిగి రాజు,కసాల జనార్దన్ రెడ్డి, కోడి వెంకన్న,మాజీ మండల అధ్యక్షులు గండూరి వెంకట్ గౌడ్, సర్పంచులు కావాలి సురేష్, బొమ్మల శేఖర్,యూత్ నాయకులు గంటేకంపు అశోక్, మండల ఉపాధ్యక్షులు గంట తులసయ్య తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?