12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి.

12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించకుండా కాలయాపన చేస్తోందని దినేష్ కుమార్ కులాచారి విమర్శించారు.

నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించకుండా కాలయాపన చేస్తోందని బీజీపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ కులాచారి విమర్శించారు. డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాలలో నీరు లేక ఎండిపోతున్న వరి పంటలను దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటలు ఎండిపోయి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ అంతటా కరువు పరిస్థితులు దాపురించాయని, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తీవ్రంగా నష్టపోతోందని దినేష్ కులచారి మండిపడ్డారు. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపనలు, ఇతర ప్రాంతాల్లో పర్యటనలకే సమయం కేటాయిస్తున్నారని, పంటలు ఎండిపోయి కన్నీరు పెడుతున్న రైతులను పరామర్శించేందుకు రావడం లేదన్నారు. సొంత నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని చెప్పిన ఎమ్మెల్యే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో జాడ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. మిగిలి ఉన్న పంటలనైనా కాపాడేందుకు రోజుకు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని,నీరు, కరెంట్ లేక ఎండిపోయిన పంటలకు తక్షణమే ఎకరానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని,ప్రభుత్వం స్పందించకపోతే రైతులను పెద్ద ఎత్తున సమీకరించి, కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రకాంత్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు జిల్లా వెల్మ గంగారెడ్డి, నాయకులు ఓంసింగ్, దేశపతి శీను, గణేష్, ప్రదీప్, సురేష్, నవీన్, రత్నం ఉన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?