అంతర్జాతీయ వేదికపై గుమ్మడిదల యువ ప్రతిభ
వేద గణితంలో ప్రపంచ స్థాయి టాప్ 5లో చోటు..
సంగారెడ్డి : పాఠశాల స్థాయిలోనే వేద గణితంలో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వార్డు యువకుడు ముక్కాల ప్రణీత్ తండ్రి శంకర్ తాజాగా అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో నిర్వహించిన 2026 ఐఈఈఈ టెక్నాలజీ సమ్మిట్ – ఎథికల్ ఏఐలో ప్రణీత్ రూపొందించిన ‘వేదిక్ మైండ్’ ప్రాజెక్ట్ ప్రపంచస్థాయి టాప్–5లో చోటు సంపాదించింది.ఐఈఈఈ ఎంటర్ ప్యూనర్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ ఫౌండర్ షోకేస్ – ఐడేషన్ ట్రాక్ కు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి 115 దరఖాస్తులు రాగా.వాటిలో ఎంపికైన ఐదు అత్యుత్తమ ప్రాజెక్టుల్లో వేదిక్ మైండ్ కు స్థానం లభించింది. దీంతో ప్రణీత్‌కు తన ఆలోచనను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సమక్షంలో ప్రదర్శించే అవకాశం దక్కింది.ఈ సందర్భంగా ప్రణీత్ తండ్రి ముక్కాల శంకర్ మాట్లాడుతూ..పాఠశాల స్థాయిలో వేద గణితంలో జాతీయ అవార్డు నుంచి ఇంజినీరింగ్ విద్యార్థిగా అంతర్జాతీయ ఐఈఈఈ వేదికపై ప్రాజెక్ట్ ప్రదర్శించే స్థాయికి ప్రణీత్ చేరుకోవడం విశేషమని ఆయన సాధించిన ఈ గుర్తింపు హైదరాబాద్ యువతలోని సాంకేతిక ప్రతిభకు, సృజనాత్మక ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తుందని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు .
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


