చికిత్స పొందుతు గృహిణి మృతి 

చికిత్స పొందుతు గృహిణి మృతి 

పాపన్నపేట : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలై ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఓ మహిళా మృతి చెందిన సంఘటన నాగ్సాన్ పల్లి లో గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట పోలీసులు,కుటింబీకుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన చెల్మెట్టి ఎల్లమ్మ వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం మెదక్ పట్టణానికి వెళ్లి తిరిగి స్వగ్రామమైన నాగ్సాన్ పల్లి కి వచ్చేందుకు ఏడుపాయల కమాన్ వద్ద రాత్రి సమయం లో వేచి ఉన్న సమయం లో ఏడుపాయల నుండి కమాన్ వైపు వస్తున్న ద్విచక్ర వాహన దారుడు ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో  స్థానికులు వెంటనే క్షతగాత్రు రాలైన ఎల్లమ్మ ను మెదక్ ప్రయివేట్ ఆసుపత్రి కి తరలించగా పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమించడం తో భాగ్యనగరం లోని ప్రయివేటు ఆసుపత్రి కి తరలించగా గత మూడు రోజులు గా చికిత్స పొందుతు గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతురాలు కుటింబికులు పాపన్నపేట పోలీసులకు పిర్యాదు చేయడం తో పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Views: 164

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?