టీబీ కేసులు లేని గ్రామంగా కోర్పోల్‌కు గుర్తింపు

టీబీ కేసులు లేని గ్రామంగా కోర్పోల్‌కు గుర్తింపు

చౌటకూర్,  : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో చౌటకూర్ మండలంలోని కోర్పోల్ గ్రామ పంచాయతీని టీబీ కేసులు లేని గ్రామంగా ప్రకటించారు.ఈ సందర్భంగా కోర్పోల్ గ్రామ సర్పంచ్  సునీత ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీవో కే. శంకర్, పంచాయతీ కార్యదర్శి మల్లేశంలకు అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జానకి రెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్రీమతి లలితా దేవిలు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ మాట్లాడుతూ.. చౌటకూర్ మండలంలోని అన్ని గ్రామాలను టీబీ కేసులు లేని గ్రామాలుగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. టీబీ వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అనుమానిత కేసులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.కోర్పోల్ గ్రామం టీబీ కేసులు లేని గ్రామంగా గుర్తింపు పొందడం పట్ల గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Image 2026-10-08 at 2.57.15 PM

ఈ సందర్భంగా కోర్పోల్ గ్రామ సర్పంచ్  సునీత ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీవో కే. శంకర్, పంచాయతీ కార్యదర్శి మల్లేశంలకు అడిషనల్ కలెక్టర్ పాండు,

Views: 151

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?