మీసేవ కేంద్రానికి వెళ్లాలంటే మురుగు నీటి కిందే వెళ్లాల్సిందే!

మీసేవ కేంద్రానికి వెళ్లాలంటే మురుగు నీటి కిందే వెళ్లాల్సిందే!

మున్సిపల్ కార్యాలయం కిందే దారాలుగా డ్రైనేజీ నీరు.. కమిషనర్, చైర్‌పర్సన్ పట్టించుకోవడంలేదంటున్న ప్రజలు

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం కింద నిర్వహిస్తున్న మీసేవ కేంద్రం వద్ద డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపుల లీకేజీ కారణంగా నీరు పై నుంచి దారాలుగా కిందికి కారుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మీసేవ కేంద్రానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఆ నీటి కిందే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీసేవ కేంద్రం ప్రవేశద్వారం వద్ద డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో ప్రజలు పక్కకు తప్పుకుని వెళ్లాల్సి వస్తోంది. నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు కూడా ఇదే మార్గంలో రాకపోకలు సాగించాల్సి వస్తుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. మున్సిపల్ కార్యాలయం పరిధిలోనే ఈ పరిస్థితి నెలకొన్నప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్ ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో డ్రైనేజీ నీరు కారుతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే లీకేజీకి కారణాన్ని గుర్తించి పైపులకు మరమ్మతులు చేపట్టి, మీసేవ కేంద్రం వద్ద డ్రైనేజీ నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?