జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్

జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్

 

నిజామాబాద్ : టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA)లో భాగంగా యువతను టీబీ నిర్మూలన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేందుకు చేపట్టిన  “జోష్ టీం” వర్చువల్ లాంచింగ్ కార్యక్రమాన్ని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె. పి. నడ్డా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని   నిజామాబాద్ ఐడీఓసీ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, NTEP సిబ్బంది వీక్షించారు. ఈ సందర్భంగా   డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీమతి గీతా మేడం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి. రాజశ్రీ, జిల్లా పరిషత్ సీఈవో   సాయ గౌడ్, డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ దేవి నాగేశ్వరి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్  సుమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.“జోష్ టీం” ద్వారా యువతలో టీబీపై అవగాహన పెంపొందించడం, టీబీ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, టీబీ అనుమానితులను గుర్తించి పరీక్షలకు ప్రోత్సహించడం, చికిత్స పొందుతున్న టీబీ రోగులకు సహకారం అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ముఖ్యంగా యువతను టీబీ నిర్మూలనలో క్రియాశీల భాగస్వాములుగా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో అవగాహనను మరింత విస్తృతం చేయడమే జోష్ టీం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
టీబీ నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు ఆరోగ్య శాఖతో పాటు వివిధ శాఖలు, యువత మరియు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిపిఓ విశాల, రవి గౌడ్, వినోద్ ,  NTEP సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?